కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో భారత్ జోడో యాత్రకు వచ్చిన ఖర్గే... ఆత్మీయ స్వాగతం పలికిన రాహుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో భారత్ జోడో యాత్రకు వచ్చిన ఖర్గే... ఆత్మీయ స్వాగతం పలికిన రాహుల్

congress new president mallikarjun kharge recieved haerty welcome from rahul gandhi
  • హైదరాబాద్ చేరిన రాహుల్ గాంధీ యాత్ర
  • నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఖర్గే
  • కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిని గుండెలకు హత్తుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ చేరింది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. భారత్ జోడో యాత్రకు ఇదివరకే ఖర్గే హాజరైనా... మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఖర్గేకు రాహుల్ గాంధీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఖర్గేను తన గుండెలకు హత్తుకున్న రాహుల్ గాంధీ... పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సింది మీరేనంటూ చెప్పారు. రాహుల్ ఆత్మీయ స్వాగతానికి ఖర్గే ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ రాహుల్ గాంధీ యాత్ర దేశ రాజకీయాలను మార్చేస్తుందని ప్రకటించారు.
Rahul Gandhi
Congress
Mallikarjun Kharge
Hyderabad
Bharat Jodo Yatra

More Telugu News