నేటి నుంచే తిరుమల సర్వదర్శన టోకెన్ల జారీ... వివరాలివిగో
- అలిపిరి వద్ద సర్వదర్శన టోకెన్ల పంపిణీ
- భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ టోకెన్ల పంపిణీ
- శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్ల జారీ
- మిగిలిన రోజుల్లో 15 వేల సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తామన్న ధర్మారెడ్డి
- టోకెన్లు లేని వారు కూడా స్వామి వారి దర్శనానికి వెళ్లొచ్చని సలహా
సర్వదర్శన టోకెన్ల జారీని సోమవారం అర్ధరాత్రి తర్వాత అలిపిరిలో జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలిపిరితో పాటు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ సర్వదర్శన టోకెన్లను పంపిణీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇకపై ప్రతి వారం శని, ఆది, సోమ వారాల్లో 25 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు... మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లను జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. నిర్ణీత సంఖ్యలో జారీ చేసే టోకెన్ల పంపిణీ ముగియగానే... కౌంటర్లను మూసివేస్తామన్న ఆయన... టోకెన్లు లేని వారు కూడా నేరుగా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.