అందరి హీరోల అభిమానులు ఇష్టపడే హీరో బాలయ్య: చందూ మొండేటి

Urvasivo Rakshasivo movie pre release event
  • అల్లు శిరీష్ హీరోగా రూపొందిన ఊర్వశివో రాక్షసివో' 
  • రొమాంటిక్ కామెడీ జోనర్లో సాగే కథ
  • సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ 
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య 
  • వచ్చేనెల 4వ తేదీన సినిమా రిలీజ్  
అల్లు శిరీష్ హీరోగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. ధీరజ్ మొగిలినేని - విజయ్ నిర్మించిన ఈ సినిమాకి, రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఏర్పాటు చేశారు. బాలకృష్ణ ముఖ్య అతిథిగా ఈ వేడుక ప్రారంభమైంది. బాలయ్య తాజా చిత్రంగా 'వీరసింహారెడ్డి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ పేరుతోనే ఆయనకి ఆహ్వానం పలకడంతో ఆయన ఖుషీ అయ్యారు.  'బింబిసార' సినిమా దర్శకుడు వశిష్ఠ .. 'కార్తికేయ 2' దర్శకుడు చందూ మొండేటి కూడా ఈ వేడుకకి విచ్చేశారు.

ఈ సినిమా 'ఆర్య' అంతటి హిట్ కావాలని కోరుకుంటున్నట్టుగా వశిష్ఠ చెప్పాడు. ఈ సినిమాలోని రొమాన్స్ ను ఆడియన్స్ థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారని అన్నాడు. ఇక చందూ మొండేటి మాట్లాడుతూ .. "బాలకృష్ణ గారి స్వఛ్ఛమైన నవ్వులంటే తనకి ఇష్టమని చెప్పాడు. అందరి హీరోల అభిమానులు ఇష్టపడే హీరో బాలకృష్ణ అంటూ ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు. 
Go Back to Shorts
Allu Sirish
Anu Emmanuel
Sunil
Vennela Kishore

More Telugu News