ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు వీడియోలు తీసి బెదిరిస్తున్నాడు!
- హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తున్న భర్త
- పలు దఫాలుగా రూ. 4 లక్షలు ఇచ్చిన భార్య
- అయినా వేధిస్తుండడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పెళ్లి తర్వాత మూడు నెలలపాటు ఎవరి ఇంట్లో వారు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కలిసి ఉంటున్నారు. ఆ తర్వాతి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పనిపాట లేకుండా ఖాళీగా ఉంటున్న నిఖిల్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నాడు. అయినప్పటికీ వేధింపులు కొనసాగించాడు.
ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించి డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. అడిగినంత ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. అతడి వేధింపులు శ్రుతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు నిన్న ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.