టీ20 వరల్డ్ కప్లో మరో సెంచరీ.. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిలిప్స్ వీర విహారం
- శ్రీలంక బౌలర్లపై రెచ్చిపోయిన ఫిలిప్స్
- 15/3తో కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకున్న వైనం
- లంకకు 168 పరుగుల లక్ష్యం ఇచ్చిన కివీస్
ఈ దశలో ఫిలిప్స్ భారీ షాట్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. డారిల్ మిచెల్ (22) సాయంతో నాలుగో వికెట్ కు 74 పరుగులు జోడించాడు. ఆపై, వరుసగా వికెట్లు పడుతున్నా.. ఫిలిప్స్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అదే జోరు కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు మంచి స్కోరు అందించి చివరి ఓవర్లో ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత రెండు, మహేశ్ తీక్షణ, ధనంజయ డిసిల్వా, లాహిరు కుమార తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలవాలంటే 20 ఓవర్లలో 168 పరుగులు చేయాలి.