'హృదయ యువరాణి' అంటూ అదితికి గ్రీటింగ్స్ చెప్పిన సిద్ధార్థ్.. రూమర్స్ నిజమేనా?
- అదితీరావు హైదరీతో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నాడని కొంత కాలంగా ప్రచారం
- ముంబై రెస్టారెంట్లలో పలుమార్లు కనిపించిన జోడీ
- 'మహాసముద్రం'లో నటించిన సిద్ధార్థ్, అదితి
మరోవైపు, తాజాగా అదితి ఫొటోను సిద్ధార్థ్ షేర్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అదితి పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెతో కలిసి దిగిన ఫొటోను సిద్ధార్థ్ షేర్ చేశాడు. అంతేకాదు ఆమెపై ఎంతో ప్రేమను వ్యక్తపరిచాడు. హృదయ యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ గ్రీటింగ్స్ తెలిపాడు. 'నీ ప్రతి కల నెలవేరాలని కోరుకుంటున్నాను' అని చెప్పాడు. దీన్ని చూసిన నెటిజెన్లు వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నిర్ధారణకు వస్తున్నారు.
ఇటీవల వచ్చిన 'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి నటించారు. ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ కు జోడీగా ఆమె నటించింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ప్రారంభమైన స్నేహం అనుబంధానికి దారి తీసిందని చెపుతున్నారు. ముంబైలోని రెస్టారెంట్లలో వీరు పలుమార్లు సందడి చేశారు.