Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇంట్లో ఆగంతుకుడి కలకలం

Man attacks on Nancy Pelosi husband
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఘటన
  • నాన్సీ పెలోసీ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి
  • సుత్తితో నాన్సీ పెలోసీ భర్తపై దాడి
  • నాన్సీ ఎక్కడ? అంటూ కేకలు
అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసీ ఇంట్లో లేరు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు నాన్సీ భర్త పాల్ పెలోసీపై దాడి చేశాడు. 

ఈ దాడిలో 82 ఏళ్ల పాల్ పెలోసీ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్ పెలోసీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఓ క్యాపిటల్ వెంచర్ సంస్థ నిర్వహిస్తున్నారు. అయితే, ఆయనపై దాడికి గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. 

కాగా, ఆ దుండగుడు ఓ సుత్తితో దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇంట్లోకి చొరబడిన అనంతరం అతడు నాన్సీ పెలోసీ కోసం వెదికినట్టు తెలుస్తోంది. నాన్సీ ఎక్కడ? నాన్సీ ఎక్కడ? అంటూ కేకలు వేసినట్టు ఇంట్లోని పనివారిని ఉటంకిస్తూ పాశ్చాత్య మీడియా ఓ కథనంలో పేర్కొంది. 

ఇటీవల నాన్సీ పెలోసీ చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్ లో పర్యటించారు. ఆమె పర్యటన అనంతరం తైవాన్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ కు దన్నుగా అమెరికా తన విమాన వాహక నౌకలను పంపడం తెలిసిందే.
Nansi Pelosi
Paul Peloci
San Fransisco
USA

More Telugu News