పట్టాలు తప్పిన బోగీలను ఈడ్చుకెళ్లిన గూడ్స్ రైలు.. బెంబేలెత్తిన జనం: వీడియో ఇదిగో!
- బొగ్గు లోడుతో వెళ్తూ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- 58 వ్యాగన్లలో 53 బోగీలు పట్టాలు తప్పిన వైనం
- ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడిన వ్యాగన్లు
పట్టాలు తప్పిన వ్యాగన్లను పెద్ద శబ్దంతో రైలు ఈడ్చుకుపోతుండడాన్ని చూసి జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు వ్యాగన్లు తొలగించి, ట్రాకుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లకు అంతరాయం కలిగినట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే తెలిపింది.