బాధ్యతల నుంచి విముక్తి కలిగింది: సోనియాగాంధీ
- కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన ఖర్గే
- కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత అతిపెద్ద బాధ్యత అన్న సోనియా
- సవాళ్లను ఐకమత్యంతో ఎదుర్కొంటామని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని సోనియా చెప్పారు. ఈ సవాళ్లను తాము పూర్తి శక్తిసామర్థ్యాలతో, ఐకమత్యంతో ఎదుర్కొంటామని అన్నారు. అందరం కలిసి తమ లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై 80 ఏళ్ల ఖర్గే గెలుపొందారు. అయితే, ఈయన గెలుపుపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. గాంధీలకు విధేయుడు కాబట్టే ఖర్గే గెలిచాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.