మనల్ని 200 ఏళ్లు పాలించిన వాళ్లను ఇప్పుడు మనం పాలిస్తున్నాం: రాంగోపాల్ వర్మ

  • బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్
  • సునాక్ ను అభినందిస్తూ భారతీయుల పోస్టులు
  • భారత్ ను బ్రిటిషర్లు పాలించిన వైనాన్ని ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం బ్రిటన్ ప్రధానిగా పదవి చేపట్టిన రిషి సునాక్... బ్రిటన్ పౌరులకు భరోసా ఇస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం విన్నంతనే భారతీయులు ఆయనను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇందులో భాగంగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా రిషి సునాక్ ను అభినందింస్తూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. 200 ఏళ్ల పాటు మనలను పాలించిన బ్రిటిషర్లను పాలించే అవకాశం ఎట్టకేలకు మనకు ఇప్పుడు దొరికింది అంటూ వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ దిశగా సత్తా చాటిన రిషి సునాక్ కు అభినందనలు అంటూ వర్మ బ్రిటన్ కొత్త ప్రధానిని ఆకాశానికెత్తేశారు.

Britain
Rishi Sunak
RGV
Twitter
Social Media

More Telugu News