కోహ్లీ బ్యాటింగ్ కు నిలిచిన ఆన్ లైన్ షాపింగ్
- షాపింగ్ మానేసి టీవీలకే అతుక్కుపోయిన జనం
- ఆదివారం మధ్యాహ్నం దాదాపుగా యూపీఐ ట్రాన్సాక్షన్లు బంద్
- మ్యాచ్ పూర్తయ్యాక మళ్లీ పుంజుకున్న వైనం
ఉదయం నుంచి..
దీపావళి సందర్భంగా ఆన్ లైన్ షాపింగ్ ఆదివారం సాధారణం కంటే ఎక్కువే ఉంది. ఉదయం 9 గంటలతో పోలిస్తే 10:30 నుంచి 12:30 మధ్యలో యూపీఐ ట్రాన్సాక్షన్లు 15 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ఆ తర్వాత మధ్యాహ్నం మ్యాచ్ మొదలయ్యే ముందు యూపీఐ ట్రాన్సాక్షన్లు తగ్గిపోయాయి. అంటే జనం ఆన్ లైన్ షాపింగ్ చేయడం తగ్గించి మ్యాచ్ చూడడంలో మునిగిపోయారు. పాకిస్థాన్ బ్యాటింగ్ పూర్తయ్యాక కొద్దిగా పెరిగి, భారత్ బ్యాటింగ్ మొదలైన 3:30 గంటల ప్రాంతంలో యూపీఐ ట్రాన్సాక్షన్లు మళ్లీ తగ్గాయి. చివరి ఓవర్ లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ఆన్ లైన్ షాపింగ్ సైట్లు తెరిచేవాళ్లే కరువయ్యారు. మ్యాచ్ పూర్తయ్యాక యథావిధిగా షాపింగ్ సైట్లు కళకళలాడాయి.