నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. పది దుకాణాలు ఆహుతి
- షార్ట్ సర్క్యూట్ కారణంగా అర్ధరాత్రి చెలరేగిన మంటలు
- మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
- బాధితులకు పరిహారం ఇస్తామన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
అలాగే, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుని కాలిబూడిదైన దుకాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులతో సమావేశమై నష్టాన్ని అంచనా వేస్తామని, అనంతరం బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.