రికార్డు స్థాయికి రూపాయి పతనం

Rupee plunges 66 paise to drop below 83
  • ట్రేడింగ్‌లో పడుతూ లేస్తున్న రూపాయి
  • ఆల్ టైం రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ
  • చరిత్రలోనే తొలిసారి 83.02కు పడిపోయిన వైనం
రూపాయి నేల చూపులు చూస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రూపాయి విలువ నిన్న చరిత్రలోనే తొలిసారిగా 83 రూపాయల దిగువకు పడిపోయి ఆల్‌టైం కనిష్ఠానికి చేరుకుంది. 82.30 వద్ద నిన్న ట్రేడింగ్ ప్రారంభం కాగా, ఆ తర్వాత ఒక దశలో 82.95 రూపాయలకు పడిపోయింది. మంగళవారం నాటి క్లోజింగ్‌తో పోలిస్తే నిన్న ఒక్క రోజే 61 పైసలు క్షీణించి 83.02 దిగువకు పడిపోయింది. 83 కిందికి పడిపోవడం చరిత్రలోనే ఇది తొలిసారి. 

బుధవారం సెషన్ ఆరంభంలో రూపాయి సానుకూలంగానే ట్రేడ్ అయింది. అయితే, ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఇది మరింత పతనమై 83.50 దిగువకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు, రిజర్వు బ్యాంకు డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ తగ్గిందని బ్యాంకర్లు చెబుతున్నారు. రూపాయి పతనం కొనసాగుతుండడంతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీరేట్లను పెంచడంపై భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టి సారించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Go Back to Shorts
Rupee
Dollar
RBI
Exchange

More Telugu News