జపాన్ లో అభిమానులతో చరణ్, ఉపాసన
- రెస్టారెంట్ లో విందు పార్టీ
- నవ్వుతూ ఫొటోలకు పోజు
- ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఉపాసన
- ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం వెళ్లిన చరణ్
జపాన్ పర్యటన విశేషాల ఫొటోలను ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. జపనీస్ అభిమానులతో వీరు రెస్టారెంట్ లో విందు పార్టీ చేసుకున్నారు. ఫ్యాన్స్ అందరూ నవ్వులు చిందిస్తున్న ఫొటోను ఉపాసన పోస్ట్ చేసింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ వెళ్లాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్లతో ఆర్ఆర్ఆర్ సంచలనం సృష్టించడం తెలిసిందే.