అమరావతే ఏపీకి ఏకైక రాజధాని: రాహుల్ గాంధీ
- కర్నూలు జిల్లాలో సాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర
- యాత్రలో ఉన్న రాహుల్ ను కలిసిన అమరావతి రైతులు
- అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్న రాహుల్
- రైతుల పోరాటానికి న్యాయ సాయం అందిస్తామని వెల్లడి
ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ...అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని అన్నారు. ఏపీ రాజధానిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదేనని కూడా రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి న్యాయపరమైన సాయం అందిస్తామని ఆయన తెలిపారు.