తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికిన ఒడిశా సీఎం
- తెలంగాణ పర్యటనకు వచ్చిన నవీన్ పట్నాయక్
- స్వాగతం పలికిన తలసాని
- పెట్టుబడిదారుల సదస్సు పాల్గొన్న ఒడిశా సీఎం
ఈ మధ్యాహ్నం సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ చేరుకోగా, బేగంపేట విమానాశ్రయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో ఆయనతో నవీన్ పట్నాయక్ భేటీ లేనట్టేనని తెలుస్తోంది.
కాగా, పెట్టుబడిదారుల సదస్సులో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ముందంజలో ఉందని కొనియాడారు.