నా అందమైన శిరోజాల రహస్యం ఇదే: అల్లు స్నేహారెడ్డి

Allu Sneha Reddy tells her secret hair oil
  • ట్విట్టర్ లో బన్నీ అర్ధాంగి పోస్టు
  • హెయిర్ ఆయిల్ ను పరిచయం చేసిన స్నేహారెడ్డి
  • తన ఫేవరెట్ ప్రొడక్ట్ అని వెల్లడి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్ధాంగి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. తన అందమైన శిరోజాల వెనుక ఉన్న రహస్యం ఏంటో చెప్పారు.

"నా ఫేవరెట్ ప్రొడక్ట్ ఏంటో చెబుతాను. ఆరోగ్యంగా నిగనిగలాడే నా జుత్తుకు కారణం... బ్లాక్ చార్మ్ హెయిర్ ఆయిల్" అని తెలిపారు. ఇది సహజసిద్ధ అంశాలతో తయారైన హెయిర్ కేర్ ప్రొడక్ట్ అని స్నేహారెడ్డి వెల్లడించారు. 

ఈ మేరకు పట్టులా జాలువారుతున్న తన కురులను ప్రదర్శిస్తూ వీడియోను కూడా పంచుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
Allu Sneha Reddy
Hair Oil
Healthy Hair
Secret
Allu Arjun
Tollywood

More Telugu News