రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు... ఏపీ, కర్ణాటక సరిహద్దులో ఓటేయనున్న రాహుల్ గాంధీ
- రేపు ఉదయం 11 గంటలకు పోలింగ్ ప్రారంభం
- సుగినేకళ్ క్యాంపులో ఓటేయనున్న రాహుల్ గాంధీ
- యాత్రలో పాల్గొంటున్న ఏపీ నేతల కోసం కర్నూలులో ఏర్పాట్లు
ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ఇటీవలే ఏపీలోకి ప్రవేశించింది. కర్ణాటక సరిహద్దులోని ఏపీలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏపీ, కర్ణాటక సరిహద్దు గ్రామం సుగినేకళ్ లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఓటు హక్కు వినియోగించనున్నారు. రాహుల్ తో యాత్రలో సాగుతున్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇక యాత్రలో పాలుపంచుకుంటున్న ఏపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.