గుడివాడలో హరికృష్ణను చిత్తుగా ఓడించింది కొడాలి నాని కాదా?: రావి వెంకటేశ్వరరావు
- కొడాలి నానిపై నమ్మకంతో హరికృష్ణ గుడివాడ నుంచి గంట గుర్తుపై పోటీ చేశారన్న వెంకటేశ్వరరావు
- కార్యకర్తలతో కలిసి నాని ఆయనను ఓడించారని ఆగ్రహం
- గుడివాడ ప్రజలు గుణపాఠం చెబుతారన్న టీడీపీ నేత
అలాంటి వెన్నుపోటు మనస్తత్వం ఉన్న నాని ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తుండడం సిగ్గు చేటని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టు రాజకీయాలు చేసే ఆయనకు గుడివాడ ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చేసిన తప్పులన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన రోజు వస్తుందని, జైలుకెళ్లక తప్పదని వెంకటేశ్వరరావు హెచ్చరించారు.