క‌ళాత‌ప‌స్వికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు...నటుడు ఆర్.నారాయణమూర్తికి కూడా

14-10-2022 Fri 19:13 | Andhra
  • ఆర్‌.నారాయ‌ణ‌మూర్తికీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • నాయుడు గోపి, పిచ్చుక శ్రీనివాస్‌ల‌కు అచీవ్ మెంట్ అవార్డులు
  • వ్య‌వ‌సాయం, సాహిత్య సేవ‌, మ‌హిళా సాధికార‌త‌ల్లోనూ అవార్డుల ప్ర‌క‌ట‌న‌
  • న‌వంబ‌ర్ 1న అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్న సీఎం జ‌గ‌న్‌
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్ర‌ముఖుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఇస్తున్న‌ డాక్ట‌ర్ వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌, డాక్ట‌ర్ వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల గ్ర‌హీత‌ల జాబితా విడుద‌లైంది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఏపీ ప్ర‌భుత్వం అవార్డు గ్రహీత‌ల పేర్ల‌ను వెల్ల‌డించింది. క‌ళ‌లు- సంస్కృతి విభాగంలో క‌ళాత‌ప‌స్వి, సినీ ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌తో పాటు న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇక ఇదే రంగంలో రంగ‌స్థ‌ల క‌ళాకారుడు నాయుడు గోపి, క‌ళంకారి నేత‌న్న పిచుక  శ్రీనివాస్‌, షేక్ గౌసియా బేగంలను వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల‌కు ఎంపిక చేశామ‌ని తెలిపింది.

సాహిత్య సేవా విభాగంలో విశాలాంధ్ర ప‌బ్లిషింగ్ హౌస్‌, ఎమెస్కో ప్ర‌చుర‌ణాల‌యం, ర‌చ‌యిత శాంతి నారాయ‌ణ‌ల‌కు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ద‌క్కాయి. వ్య‌వ‌సాయ విభాగంలో ఆదివాసీ కేష్యూన‌ట్స్ ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ కంపెనీకి చెందిన సోడెం ముక్క‌య్య‌, కుశ‌ల‌వ కోకోన‌ట్ ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ కంపెనీకి చెందిన గోపాల‌కృష్ణ‌, అన్న‌మయ్య మూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన జ‌య‌బ్బ‌నాయుడు, అమృత ఫ‌ల ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ కంపెనీకి చెందిన మౌక్తిక‌, క‌ట్ట‌మంచి బాల‌కృష్ణారెడ్డిలు వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల‌కు ఎంపిక‌య్యారు. 

మ‌హిళా సాధికారత‌, ర‌క్ష‌ణ విభాగం కింద ప్ర‌జ్వ‌లా ఫౌండేష‌న్‌కు చెందిన సునీతా కృష్ణ‌న్‌తో పాటు శిరీష రీహాబిలిటేష‌న్ సెంట‌ర్‌, దిశ పోలీసింగ్‌లను వైఎస్సార్‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. దిశ పోలీసింగ్‌లో ఫిర్యాదు అందిన నిమిషాల్లో స్పందించిన ఐదుగురు పోలీసుల‌కు అచీవ్‌మెంట్ అవార్డులు ద‌క్కాయి. ఈ అవార్డుల‌ను రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని న‌వంబ‌ర్ 1న సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్ర‌హీత‌ల‌కు అంద‌జేయ‌నున్నారు.
YSRCPYS JaganYSR Lifetime Achievement AwardsYSR Achievement Awards

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more