క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కూడిన రిచార్జ్ ప్లాన్స్ ను తొలగించిన జియో
- ఇప్పటిదాకా తమ ప్లాన్ తో పాటు హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఇచ్చిన జియో
- టీ20 ప్రపంచ కప్ ముంగిట ప్లాన్స్ ను మార్చుతూ నిర్ణయం
- సొంతంగా స్పోర్ట్స్ 18 చానెల్ ను తీసుకొచ్చిన రిలయన్స్
ఈ ఆదివారం నుంచి టీ20 ప్రపంచ కప్ ముంగిట జియో ఈ నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. జియో మాతృసంస్థ రిలయన్స్ .. స్పోర్ట్స్ 18 పేరుతో సొంతంగా స్పోర్ట్స్ చానల్ ను ప్రారంభించింది. వూట్ యాప్ లో నూ ఈ చానల్ కంటెంట్, స్ర్టీమింగ్ ను అందుబాటులో ఉంచింది. అలాగే ఐపీఎల్ మీడియా డిజిటల్ హక్కులను రిలయన్స్ సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ మొత్తంతో వీటిని కొనుగోలు చేసింది. భారత క్రికెట్ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్ ల ప్రసార హక్కులతో పాటు ఇతర ఆటల ప్రసార హక్కులను కొనుగోలు చేసే ఆలోచనలో రిలయన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తమ స్పోర్ట్స్ 18కి పోటీదారు అయిన స్టార్ నెట్ వర్క్ కు చెందిన హాట్ స్టార్ తో టై అప్ ను జియో రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.