Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

30 ఏళ్ల తరువాత మణిరత్నంతో రజనీకాంత్!

Rajanikanth in Manirathnam Movie
  • షూటింగు దశలో రజనీ 'జైలర్'
  • మరో రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టిన రజనీ 
  • ఆయనకి లైన్ వినిపించిన మణిరత్నం
  • మరోసారి ఈ కాంబో సెట్ కావడం ఖాయమే  
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ .. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'దళపతి'. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికీ ... ఇప్పటికీ ఒక సంచలనమే. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాను ఇళయరాజా మ్యూజికల్ హిట్ గా నిలబెట్టారు. ఎమోషన్ తో ముడిపడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. 

అలాంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లలోను రజనీకాంత్ - మణిరత్నం మళ్లీ కలిసి పనిచేయలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ రజనీకి మణిరత్నం లైన్ చెప్పడం .. రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. 

అప్పటి 'దళపతి' తెచ్చిన క్రేజ్ .. రీసెంట్ గా 'పొన్నియిన్ సెల్వన్' తెచ్చుకుంటున్న వసూళ్లు చూసే రజనీ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీ 'జైలర్' సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఆయన యువ దర్శకులతో రెండు సినిమాలను లైన్లో పెట్టారు. అవి పూర్తి చేసేలోగా, 'పొన్నియిన్ సెల్వన్ 2'ను మణిరత్నం పూర్తి చేస్తారన్న మాట.
Rajanikanth
Manirathnam
Kollywood

More Telugu News