చంద్రబాబుపై గుట్కా నాని అవాకులు, చవాకులు పేలుతున్నారు: బుద్ధా వెంకన్న
- అప్పుల్లో ఉన్న కొడాలి నాని వేల కోట్లు ఎలా సంపాదించారన్న వెంకన్న
- ఒకప్పుడు వైఎస్సార్ పునాదులు కదుపుతానని వెళ్లారని వ్యాఖ్య
- పార్టీ మారితే జగన్ ని కూడా తిడతారన్న వెంకన్న
తమ అధినేత చంద్రబాబు మీద గుట్కా నాని అవాకులు, చెవాకులు పేలుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని చెప్పారు. రేపు మరొక పార్టీలోకి మారితే... జగన్ ను కూడా నాని తిడతారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నానిని పిచ్చోడిలా చూస్తున్నారని చెప్పారు. తాము చంద్రబాబు మీద అభిమానంతో పని చేస్తున్నామని అన్నారు. కొడాలి నాని, జగన్ లు చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు. మతి భ్రమించి మాట్లాడుతున్న నానికి తాము ఏం సమాధానం చెపుతామని అన్నారు. కొడాలి నాని లాంటోళ్లు ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయారని చెప్పారు.