దేశంలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- ధరణి పోర్టల్ తో కేసీఆర్ కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడిందన్న కోమటిరెడ్డి
- హైదరాబాద్ పరిసరాల్లో రూ. 18 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని ఆరోపణ
- ధరణి పోర్టల్ పై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్
ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే ఏకంగా రూ. 18 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని చెప్పారు. మన దేశంలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణమని అన్నారు. ధరణి పోర్టల్ పై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.