ఆస్ట్రేలియాకు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. పంత్ కోసమేనా?
- నా హృదయాన్ని అనుసరిస్తూ వచ్చా.. అంటూ రౌతేలా పోస్టు
- పంత్ కోసమేనా? అంటూ నెటిజన్ల ప్రశ్న
- నాలుగేళ్ల క్రితం నుంచే వారి మధ్య ఏదో ఉన్నట్టు ఊహాగానాలు
దీనికి తోడు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూడా ఇందుకు ఊతమిస్తోంది. ‘నా హృదయాన్ని అనుసరిస్తూ వచ్చా’ అన్న క్యాప్షన్‌తో విమానంలో ఉన్న ఫొటోను ఊర్వశి షేర్ చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్లింది పంత్ కోసమేనా? అని ఒకరంటే.. పంత్ నీ కోసం అక్కడ వేచి చూస్తున్నాడు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
పంత్-ఊర్వశి మధ్య ఏదో నడుస్తున్నట్టు నాలుగేళ్ల క్రితమే పుకార్లు షికారు చేశాయి. 2018లో వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌లో కనిపించారు. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారన్న వార్తలు కూడా వినిపించాయి. కాగా, ఊర్వశితో డేటింగ్ వార్తలను పంత్ ఇప్పటికే కొట్టిపడేశాడు. మరిప్పుడు రౌతేలా ఎవరి కోసం వెళ్లినట్టో!!