Tollywood: మ‌రో భారీ ఆఫ‌ర్ కొట్టేసిన శ్రీలీల‌

Sreeleela on board for Boyapati and Ram movie
షార్ట్స్‌లో చూడండి
‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌గా పరిచయమైన యువ న‌టి శ్రీలీల. తొలి చిత్రంతోనే అందం, అభిన‌యంతో పాటు చలాకీతనంతో మంచి మార్కులు కొట్టేసింది. దాంతో, అతి కొద్ది కాలంలోనే వరుస అవకాశాల‌తో దూసుకెళ్తోందామె. వరుస ఆఫర్స్ ఆమె కోసం క్యూ కడుతున్నాయి. యువ హీరోల‌తో పాటు సీనియ‌ర్లు, స్టార్ల స‌ర‌స‌న కూడా న‌టించే అవ‌కాశాలు ఆమెను వ‌రిస్తున్నాయి. ర‌వితేజ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్ గా న‌టించిన ధ‌మాకా విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు ఆమెను మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌రించింది. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో న‌టించే చాన్స్ కొట్టేసింది. పోతినేని రామ్ హీరోగా బోయపాటి రూపొందించే తాజా చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల‌ను ఖాయం చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 

కాగా, ఈ చిత్రానికి ఇంకా పేరు ఖ‌రారు చేయ‌లేదు. రెగ్యుల‌ర్ షూటింగ్ నిన్న‌నే రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. మొద‌ట యాక్ష‌న్ ఎపిసోడ్స్ తీయ‌నున్నారు. ముప్ఫై రోజుల పాటు ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలోనూ ఏక‌కాలంలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండ‌గా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తోంద‌ని వినికిడి. ఇప్ప‌టికే ఆమె చేతిలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. అదే స‌మ‌యంలో నితిన్, వైష్ణవ్‌ తేజ్‌, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. 
Go Back to Shorts
Tollywood
heroine
sreeleela
Boyapati Sreenu
ram pothineni
new movie

More Telugu News