సూర్యలంక బీచ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
- బీచ్ లో విహారానికి వచ్చిన విజయవాడ యువకులు
- ఆరుగురి మృతి
- ఈ ఘటన కలచివేసిందన్న చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన టీడీపీ అధినేత
మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారని పేర్కొన్నారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబాలకు అపార నష్టం జరిగిందని వివరించారు. పండుగవేళ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు.
పర్యాటక కేంద్రాల వద్ద ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే, మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.