Tirumala: తిరుమ‌ల‌లో ముగిసిన బ్ర‌హ్మోత్స‌వాలు... శాస్త్రోక్తంగా సాగిన ధ్వ‌జావ‌రోహ‌ణం

bramhostavam concluded in tirumala
షార్ట్స్‌లో చూడండి
క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల కొండ‌పై గ‌డ‌చిన 9 రోజులుగా వేడుక‌గా సాగిన శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు బుధ‌వారం రాత్రి ముగిశాయి. బుధ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా సాగిన ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల పాటు ఏకాంతంగానే స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌గా... క‌రోనా విస్తృతి త‌గ్గిన నేప‌థ్యంలో ఈ ఏడాది భ‌క్తుల మ‌ధ్యే శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు వేడుక‌గా జ‌రిగాయి

రెండేళ్లుగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు చూడ‌లేక‌పోయిన వెంక‌న్న భ‌క్త గ‌ణం ఈ ఏడాది జ‌రిగిన బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తార‌ని అంచ‌నా వేసిన టీటీడీ అందుక‌నుగుణంగానే ఏర్పాట్లు చేసింది. బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ ఎలాంటి విఘ్నాలు లేకుండానే పూర్తి అయ్యాయి.
Go Back to Shorts
Tirumala
TTD
Bramhotsavam

More Telugu News