దసరా పర్వదినాన కర్ణాటక ఆలయంలో సోనియా గాంధీ ప్రత్యేక పూజలు
- కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
- యాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇచ్చిన రాహుల్
- కుమారుడిని కలిసేందుకు కర్ణాటక వచ్చిన సోనియా
- భీమనకొల్లి మహదేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైనం
విజయ దశమి నాడే కర్ణాటక వచ్చిన సోనియా గాంధీ... బెంగళూరు, హోసూరు మధ్యలో ఉన్న బెంగూరులోని భీమనకొల్లి మహదేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహదేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన సోనియా గాంధీ... ఆలయంలో హారతి అందుకుని ప్రసాదం స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఆమె కాసేపు కూర్చున్నారు.