ఆయుధ పూజ చేసి తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్
- ఆయన వెంట కుమారస్వామి, తిరుమాళవన్
- ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు
- మొదలైన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
అనంతరం జరిగే మీడియా సమావేశంలో కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలంగాణ భవన్ బయల్దేరే ముందు దసరా సందర్భంగా కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సీఎం కేసీఆర్ పరస్పర శుభాకాంక్షలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు.