ఆరోగ్యవంతులకు తక్కువ ధరకే ఆదిత్య బిర్లా హెల్త్ ప్లాన్

  • మంచి ఆరోగ్యం ఉంటే ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్
  • 35 ఏళ్లలోపు తీసుకుంటే 5-10 శాతం వరకు తగ్గింపు
  • బింగే రీఫిల్ ఫీచర్ తో అదనంగా 100 శాతం కవరేజీ
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఆకర్షణీయమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని పేరు ‘యాక్టివ్ ఫిట్’. ఆరోగ్యవంతులైన యువతీ, యువకులను దృష్టిలో పెట్టుకుని ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ ప్లాన్ ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ తీసుకునే వారికి ప్రీమియంలో 10 శాతం ‘గుడ్ హెల్త్ డిస్కౌంట్’ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆరోగ్య చరిత్ర, వినూత్నమైన ఫేషియల్ స్కాన్ ఆధారంగా ఈ డిస్కౌంట్ ను నిర్ణయిస్తుంది.

శారీరక కార్యకలాపాల ద్వారా చురుగ్గా ఉన్న వారికి 50 శాతం వరకు హెల్త్ రిటర్నులను కూడా అందిస్తోంది. మేటర్నిటీ కవరేజీతోపాటు, ఆధునిక చికిత్సలు, హాస్పిటల్ లో చేరి తీసుకునే చికిత్సలకు ఈ పాలసీ చెల్లింపులు చేస్తుంది. ప్రీమియం కూడా అందుబాటులోనే ఉంటుందని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది. 35 ఏళ్ల వయసులోపు వారు ఈ పాలసీ రెన్యువల్ సమయంలో ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ పొందొచ్చు. 4 నుంచి 7వ పాలసీ సంవత్సరం వరకు 5 శాతం, 8వ పాలసీ సంవత్సరం నుంచి ప్రతి రెన్యువల్ సమయంలో ప్రీమియంలో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. 

ఒకవేళ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం వల్ల బీమా కవరేజీ మొత్తం అయిపోయినా ఆందోళన చెందక్కర్లేదు. బింగే రీఫిల్ ఫీచర్ తో తిరిగి నూరు శాతం కవరేజీని పొందే ఫీచర్ ఈ ప్లాన్ లో ఉంది.

Aditya Birla Health Insurance
activ fit
health plan
discount

More Telugu News