Jee Main: జేఈఈ మెయిన్ పరీక్ష పత్రం లీక్ కేసులో రష్యా జాతీయుడి అరెస్ట్

  • గతేడాది జేఈఈ పరీక్షల సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్
  • రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ పై ఆరోపణలు
  • సీబీఐ దర్యాప్తు
  • భారత్ ను వీడి వెళ్లిపోయిన మిఖాయిల్ షార్గిన్
  • లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ
CBI arrests Russian national in JEE software tampering issue

గతేడాది జేఈఈ మెయిన్ పరీక్ష పత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

జేఈఈ పరీక్షల కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐలియన్ పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ ఈ సాఫ్ట్ వేర్ ను ట్యాంపరింగ్ చేశాడన్నది అతడిపై నెలకొన్న ప్రధాన అభియోగం. 

గతేడాది ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, మిఖాయిల్ షార్గిన్ భారత్ ను వీడి వెళ్లిపోయాడు. అతడిపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో, మిఖాయిల్ షార్గిన్ నేడు కజకిస్థాన్ నుంచి ఢిల్లీ వచ్చాడు. అతడిని ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలువరించారు. అతడిని సీబీఐ అధికారులకు అప్పగించారు. సీబీఐ అధికారులు మిఖాయిల్ షార్గిన్ ను సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ అంశంపై ప్రశ్నిస్తున్నారు.

More Telugu News