CM Jagan: విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు. 

జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.
CM Jagan
Dasara
Wishes
Andhra Pradesh

More Telugu News