మన మార్కెట్లోకి గూగుల్ ఫిట్ బిట్ కొత్త స్మార్ట్ వాచీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన మార్కెట్లోకి గూగుల్ ఫిట్ బిట్ కొత్త స్మార్ట్ వాచీలు

Fitbit Sense 2 Versa 4 and Inspire 3 now available in India
  • మూడు రకాల స్మార్ట్ వాచ్ లను తీసుకొచ్చిన గూగుల్
  • ఫిట్ బిట్ ఇన్ స్పైర్ ధర రూ.8,999
  • రూ.20 వేలకు పైనే మిగిలిన రెండింటి ధరలు 
గూగుల్ కు చెందిన ఫిట్ బిట్ నూతన తరం స్మార్ట్ వాచీలు.. ఫిట్ బిట్ వెర్సా 4, ఫిట్ బిట్ సెన్స్ 2, ఇన్ స్పైర్ 3 ఇప్పుడు మన భారత్ లోనూ కొనుగోళ్లకు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ తో భాగస్వామ్యం కలిగిన రిటైల్ స్టోర్లలో ఇవి లభిస్తాయి. వీటిల్లో హార్ట్ రేట్ ను మానిటర్ చేసే సెన్సార్, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ చెప్పే సెన్సార్ తదితర ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. 

ధరలు
ఫిట్ బిట్ ఇన్ స్పైర్ 3 తక్కువ రేటుతో ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న సాధనం. దీని ధర రూ.8,999. మిగిలిన రెండు మోడళ్లు.. ఫిట్ బిట్ సెన్స్ 2 రూ.20,499, వెర్సా 4 ధర రూ.24,999గా ఉంది. వీటిని ఆన్ లైన్ లో అమెజాన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు వస్తుంది. 

ఫీచర్లు
ఇన్ స్పైర్ 3 అన్నది ఫిట్ నెస్ బ్యాండ్ వంటిది. ఫిట్ నెస్ ప్రేమికులకు ఇది అనుకూలం. నిద్రా తీరు, ఒత్తిడి స్థాయులను ట్రాక్ చేస్తుంది. సెన్స్ 2 లోనూ ఇన్ స్పైర్ 3 ఫీచర్లు అన్నీ ఉన్నాయి. అలాగే, 40 ఎక్సర్ సైజ్ మోడ్స్, జీపీఎస్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్కిన్ టెంపరేచర్ ఎంత ఉందో చెప్పే సెన్సార్లు ఉన్నాయి. వెర్సా 4లో అదనంగా ఈసీజీ ట్రాకింగ్ కూడా ఉంటుంది. వెర్సా 4, సెన్స్ 2 రెండూ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తున్నాయి. ఫిట్ బిట్ ను గూగుల్ కొనుగోలు చేయడం తెలిసిందే.
Fitbit
Sense 2
Versa 4
Inspire 3
available
Indian market
amazon

More Telugu News