OMC Case: మ‌న‌వ‌రాలిని చూసేందుకు బ‌ళ్లారి వెళ‌తాన‌న్న గాలి జ‌నార్దన్ రెడ్డి... నిజ‌మో, కాదో తేల్చాల‌ని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

  • బ‌ళ్లారి వెళ్లేందుకు అనుమ‌తించాల‌ని జ‌నార్ద‌న్ రెడ్డి పిటిష‌న్‌
  • 2 నెల‌ల పాటు విచార‌ణ వాయిదా వేయ‌డం కుద‌ర‌ద‌న్న సుప్రీంకోర్టు
  • క‌నీసం నెల రోజుల పాటైనా బ‌ళ్లారిలో ఉండేందుకు అనుమ‌తించాల‌న్న జనార్దన్ రెడ్డి  
  • విచార‌ణ‌ను రేప‌టికి వాయిదా వేసిన వైనం
gali jarardgan reddy filesa petition in supreme court to permit him to stay at bellary

ఓబుళాపురం అక్ర‌మ గ‌నుల తవ్వ‌కాల కేసులో నిందితుడిగా ఉన్న క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి మ‌రోమారు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న సొంతూరు బ‌ళ్లారి వెళ్లేందుకు త‌న‌కు అనుమ‌తినివ్వాల‌ని స‌ద‌రు పిటిష‌న్‌లో ఆయ‌న కోర్టును కోరారు. ఈ పిటిష‌న్‌ను గురువారం విచారించిన కోర్టు... గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి మ‌రింత మేర స‌డ‌లింపులు ఇచ్చేందుకు నిరాక‌రించింది. అంతేకాకుంగా ఆయన చెబుతున్న విష‌యాలు నిజ‌మో, కాదో తేల్చాల‌ని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది.

త‌న‌కు ఇటీవ‌లే మ‌న‌వ‌రాలు పుట్టింద‌ని, మ‌న‌వ‌రాలిని చూసేందుకు త‌న‌కు 2 నెల‌ల పాటు బ‌ళ్లారిలో ఉండేందుకు అనుమ‌తించాల‌ని జ‌నార్ద‌న్ రెడ్డి కోరారు. ఈ కేసులో ఇప్ప‌టికే తీవ్ర జాప్యం జ‌రిగిన నేప‌థ్యంలో రోజువారీ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయ‌నున్న ప్ర‌స్తుత త‌రుణంలో 2 నెల‌ల పాటు విచార‌ణ‌ను వాయిదా వేయ‌లేమంటూ కోర్టు తెలిపింది. అయితే క‌నీసం ఓ నెల పాటైనా తాను బ‌ళ్లారిలో ఉండేందుకు అనుమ‌తించాల‌ని ఆయ‌న కోర్టును కోరారు. దీంతో జ‌నార్ద‌న్ రెడ్డి చెబుతున్న విష‌యాలు వాస్త‌వ‌మో, కాదో ప‌రిశీలించి త‌మ‌కు నివేదించాల‌ని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News