tata: ఒక్కసారి చార్జ్‌ చేస్తే 315 కి.మీ ప్ర‌యాణం.. కొత్త ఈవీ కారును లాంచ్ చేసిన టాటా

  • టియాగో ఈవీని విడుద‌ల చేసిన దిగ్గ‌జ కంపెనీ
  • రూ. 8.49 ల‌క్షల ప్రారంభ ధ‌ర (ఎక్స్‌-షోరూం)
  • అక్టోబ‌ర్ 10 నుంచి బుకింగ్స్‌.. జ‌న‌వ‌రి నుంచి డెలివ‌రీ
Tata Tiago EV with 315km range launched in India

స్వ‌దేశీ వాహ‌న త‌యారుదారీ దిగ్గ‌జం టాటా మోటార్స్ త‌న మూడో ఎల‌క్ట్రిక్ మోడ‌ల్‌.. టియాగో ఈవీ కారును బుధ‌వారం లాంచ్ చేసింది. రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో దీన్ని విడుదల చేసింది. టియాగో ఈవీ టాప్ వేరియంట్ ధ‌ర రూ. 11.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంద‌ని తెలిపింది. ఇవి పరిచయ ధ‌ర‌లు అని, మొద‌టి ప‌ది వేల మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. టాటా కంపెనీ ఇప్ప‌టికే నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీల‌ను కూడా విక్రయిస్తుంది.

కాగా, టియాగో ఈవీ బుకింగ్స్ అక్టోబ‌ర్ 10న ప్రారంభం అవుతాయి. జ‌న‌వ‌రి నుంచి కార్ల‌ను వినియోగ‌దారుల‌కు డెలివ‌రీ చేస్తారు. టియాగో ఈవీ తొలి 10,000 యూనిట్లలో 2,000 యూనిట్లను కంపెనీ రిజర్వ్ చేసింది. ఇప్పటికే ఉన్న నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ య‌జ‌మానుల‌కు ప్రారంభ ధ‌ర‌కు అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. కొత్త టాటా టియాగో ఈవీ రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లలో (19.2 కేడ‌బ్ల్యూహెచ్‌, 24 కేడ‌బ్ల్యూహెచ్) లభిస్తుంది. ఈ వాహ‌నం ఐపీ67-రేటెడ్ బ్యాటరీ ప్యాక్, మోటార్‌తో వస్తుంది. రెండింటికి ఎనిమిదేళ్లు, 1,60,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ ఉంటుంది. 

పూర్తిగా చార్జ్ చేసిన త‌ర్వాత టియాగో ఈవీ గ‌రిష్ఠంగా 315 కిమీ వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఇందులో అనేక డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. స్పోర్ట్ మోడ్‌లో 5.7 సెకన్లలో 0-60 కి.మీ. వేగం అందుకుంటుది. టియాగో ఈవీలో ప్రొజెక్టర్ ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, డ్యూయల్-టోన్ రూఫ్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, లెథ‌ర్‌ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

More Telugu News