రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్: రాంగోపాల్ వర్మ
- బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ వెళుతుందన్న వర్మ
- పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా స్టార్లను ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై ట్వీట్
- పాన్ ఇండియా సినిమాల అడుగుజాడల్లోనే టీఆర్ఎస్ పయనిస్తోందని వెల్లడి
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగు జాడల్లో పయనిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి బీఆర్ఎస్గా ఎంట్రీ ఇవ్వనుందని వర్మ తెలిపారు. రీల్ ఫిల్మ్ స్టార్లు అయిన యశ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల మాదిరిగా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్‌గా నిలవనున్నారని ఆయన పేర్కొన్నారు.