భార‌త్ జోడో యాత్ర‌లో 'విలాసాల విడిది' ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇదిగో!

congress reploes with a video on allegations over 5 star facilities in bharat jodo yatra
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాలుపంచుకుంటున్న నేత‌ల‌కు ఆ పార్టీ విలాసాల‌తో కూడిన విడిది ఏర్పాటు చేసింద‌ని వైరివ‌ర్గాల నుంచి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో... వాటిపై కాంగ్రెస్ పార్టీ సోమ‌వారం ఓ వీడియో సాక్ష్యంతో వివ‌ర‌ణ ఇచ్చింది. సోమ‌వారం 14 కిలో మీట‌ర్ల మేర సాగిన యాత్ర అనంత‌రం యాత్ర‌లో పాలుపంచుకున్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఓ పెద్ద గోడౌన్‌లా క‌నిపిస్తున్న భ‌వ‌నంలో నేల మీదే ప‌రుపులు వేసుకుని ప‌డుకున్నారు. 

ఈ విడిదిలో పురుషులు, మ‌హిళ‌లు అన్న తేడా లేకుండా పార్టీ శ్రేణులంతా ఎవ‌రికి వారుగా త‌మ‌కు ఇచ్చిన ప‌రుపులు ప‌ర‌చుకుని ప‌డుకున్నారు. భార‌త్ జోడో యాత్ర‌లో 5 స్టార్ విలాసాలు అంటూ వైరి వ‌ర్గాలు ఆరోపిస్తున్న విలాసాల‌తో కూడిన విడిది ఇదేనంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు మ‌నీష్ కందూరి తెలిపారు.
Go Back to Shorts
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra

More Telugu News