'గాడ్ ఫాదర్' విషయంలో నా అంచనా తప్పలేదు: మెగాస్టార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గాడ్ ఫాదర్' విషయంలో నా అంచనా తప్పలేదు: మెగాస్టార్

Chiranjeevi Interview
  • అక్టోబర్ 5న విడుదల కానున్న 'గాడ్ ఫాదర్'
  • సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో కనిపించనున్న మెగాస్టార్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా చిరంజీవి
  • కొత్తగా ఫ్లైట్ లో సాగిన ఇంటర్వ్యూ 
  • సల్మాన్ కి హ్యాట్సాఫ్ చెప్పిన చిరూ 
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందింది. ఎన్వీ  ప్రసాద్ - ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమాను, అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అందులో భాగంగా ప్రైవేట్ ఫ్లైట్ లో చిరంజీవి ఇంటర్వ్యూ కొనసాగింది. 'గాడ్ ఫాదర్' సినిమా గురించి శ్రీముఖి అడిగిన ప్రశ్నలకు చిరంజీవి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 

 చిరంజీవి మాట్లాడుతూ .. "ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ ను వదలడం జరిగింది. 'రాజకీయాలకు నేను దూరమయ్యానుగానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అంటూ నేను చెప్పిన డైలాగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. నిజంగా ఈ స్థాయిలో ఈ డైలాగ్ పేలుతుందని నేను అనుకోలేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు ..  సాంగ్స్ ఉండవు. కానీ అవి లేవనే ఆలోచన ప్రేక్షకులకి రాకుండా కథ నడుస్తుంది. 

కొత్తగా నన్ను నేను ఆవిష్కరించుకోవడం కోసమే నేను 'లూసిఫర్' రీమేక్ ను ఎంచుకున్నాను. జీవితాన్ని కాచి ఒడబోశాడు అనేట్టుగా కనిపించాలనే ఉద్దేశంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ను ఎంచుకున్నాను. లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఊహ .. అంచనా తప్పలేదని అనిపించింది. ఈ సినిమాలో నాపై గల ప్రేమతో సల్మాన్ చేశాడు. అందుకు ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. మా ఇద్దరి మధ్య సాంగ్ ను ప్రభుదేవా గొప్పగా కంపోజ్ చేశాడు. 

సత్యప్రియ పాత్రలో నయనతార అద్భుతంగా ఒదిగిపోయింది. ఆమె గ్లామర్ .. యాక్టింగ్ ఈ సినిమాకి బాగా సపోర్టు చేశాయి. ఇక సత్యదేవ్ ను ఆ పాత్రకి నేనే సిఫార్స్ చేశాను. ప్రతినాయకుడి తరహాలో సాగే ఆ పాత్రలో అతను గొప్పగా చేశాడు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో పూరి కనిపిస్తాడు. కారవాన్ నుంచి షాట్ కి రావడానికి కాస్త నెర్వస్ ఫీలయ్యాడు గానీ .. ఆ తరువాత చాలా బాగా చేశాడు" అంటూ చిరూ నవ్వేశారు.
Chiranjeevi
Nayanthara
Salman Khan
God Father Movie

More Telugu News