భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్ కాస్తా 8 ఓవర్ల మ్యాచ్ అయింది!
- నాగపూర్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
- గత రాత్రి వర్షం... చిత్తడిగా అవుట్ ఫీల్డ్
- టాస్ బాగా ఆలస్యం
- ఇప్పటికీ ప్రారంభం కాని మ్యాచ్
మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నితిన్ మీనన్, కేఎన్ అనంతపద్మనాభన్ 8 ఓవర్ల మ్యాచ్ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఒక్కో జట్టు 8 ఓవర్లు ఆడుతుందని, పవర్ ప్లేలో 2 ఓవర్లు ఉంటాయని, ఒక బౌలర్ రెండు ఓవర్లకు మించి బౌలింగ్ చేయకూడదని తాత్కాలిక నిబంధనలను వివరించారు. 9.15 గంటలకు టాస్ వేసే అవకాశం ఉంది. 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
.