ఏలూరు కోర్టుకు వెళ్లండి... తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు సుప్రీంకోర్టు సూచన
- అగ్రిగోల్డ్ కేసును ఏలూరు కోర్టుకు బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు
- తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం
- తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
అగ్రిగోల్డ్ సంస్థ ఏకంగా 32 లక్షల మంది డిపాజిట్లను నట్టేట ముంచిందని, ఈ వ్యవహారంలో ఆ సంస్థ రూ.6 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని సేకరించిందని.. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ముందుగా ఏలూరు కోర్టుకే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.
అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను వేలం వేయడం ద్వారా తెలంగాణ హైకోర్టు కేవలం రూ.50 కోట్లే రాబట్టిందన్న డిపాజిటర్లు... ఆ తర్వాత కేసును ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు చెప్పిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు తీర్పును రద్దు చేయడం గానీ, మార్చడం గానీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.