Jeevitha: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీవిత?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు యత్నిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర మంత్రులు, కీలకమైన నాయకులు తరచుగా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత కూడా పూర్తయింది.

మరోవైపు సినీ స్టార్లతో కూడా బీజేపీ పెద్దలు సమావేశమవుతూ... పార్టీకి గ్లామర్ తీసుకొస్తున్నారు. సినీ నటి జీవిత ఇటీవలే బీజేపీలో చేరారు. మరోవైపు జీవితకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జీవిత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి 1,38,947 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు.
Jeevitha
BJP
Zahirabad
MP

More Telugu News