సాఫ్ట్ వేర్ ఇంజినీర్లా... దయచేసి కాల్ చేయొద్దు...!: ఆసక్తికరంగా వధువు మ్యాట్రిమొనీ యాడ్
- వరుడి కోసం పత్రికా ప్రకటన
- అబ్బాయి ఐఏఎస్/ఐపీఎస్ అయ్యుండాలన్న అమ్మాయి
- ఐటీ రంగానికి భవిష్యత్తు లేదని వెల్లడి
అబ్బాయి తప్పనిసరిగా ఐఏఎస్/ఐపీఎస్/డాక్టర్ (పీజీ), ఇండస్ట్రియలిస్ట్/బిజినెస్ మేన్ అయ్యుండాలని ఆ అమ్మాయి పేర్కొంది. అది కూడా తమ కులానికి చెందినవాడే అయ్యుండాలని తెలిపింది.
అయితే ఆ ప్రకటన చివర్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఉద్దేశించి ఓ హెచ్చరిక జారీ చేసింది. "సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దయచేసి కాల్ చేయొద్దు... భవిష్యత్తులో ఐటీ రంగానికి ఏమంత గొప్ప రోజులు లేవు" అని స్పష్టం చేసింది. ఈ మ్యాట్రిమొనీ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.