ఆసీస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన హార్దిక్ పాండ్యా... భారత్ భారీ స్కోరు
- మొహాలీలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
- 30 బంతుల్లోనే 71 పరుగులు చేసిన పాండ్యా
- పాండ్యా స్కోరులో 7 ఫోర్లు, 5 సిక్సులు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 రన్స్ చేసిన టీమిండియా
పాండ్యా సంచలన ఇన్నింగ్స్ సాయంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 55, సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేశారు.
రోహిత్ 11, కోహ్లీ 2, దినేశ్ కార్తీక్ 6, అక్షర్ పటేల్ 6 పరుగులు చేసి అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హేజెల్ వుడ్ 2, కామెరాన్ గ్రీన్ 1 వికెట్ తీశారు.