తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
- రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడొచ్చని అంచనా
- బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావమే కారణం
- పలు జిల్లాల అధికారుల అప్రమత్తం
సాయంత్రం, రాత్రి సమయాల్లోనే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో, ఆ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.