ఆంధ్రప్రదేశ్ 'అదానీ ప్రదేశ్' అయిపోయింది: చింతా మోహన్ విమర్శలు
- అసెంబ్లీ సమావేశాలు అబద్ధాలతోనే గడిచిపోతున్నాయన్న చింతా మోహన్
- పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని విమర్శ
- మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపణ
ఏపీలో కోటి మంది పేదలు ఆకలితో నిద్రపోతున్నారని... రాజన్న రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ల ధర ఆకాశాన్నంటుతోందని... ఇదే అంశం 2024లో యూపీఏను గెలిపిస్తుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 500కు తీసుకొచ్చే ఫైల్ పైనే తొలి సంతకం చేస్తామని అన్నారు. ఏపీని విడగొట్టమని దొంగ సలహాను ఇచ్చింది గులాం నబీ అజాద్ అని చెప్పారు.