మూడేళ్ల నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని వ్యక్తిని ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎలా ఎంపిక చేస్తారు?: ఆకాశ్ చోప్రా
- ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ కు షమీ, ఉమేశ్ ఎంపిక
- 2019 నుంచి జాతీయ జట్టుకు ఆడని ఉమేశ్
- కరోనా కారణంగా ఏడాది కాలంగా ఆడని షమీ
ఇక షమీ ప్రస్తుత సంవత్సరంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని గుర్తుచేశారు. టీ20 ప్రపంచకప్ కు మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయంలో వీరిద్దరినీ ఎలా ఎంపిక చేస్తారని చోప్రా ప్రశ్నించారు. వరల్డ్ కప్ కు బీసీసీఐ ప్లాన్స్ అన్నీ తలకిందులైనట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు ఇదే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ... షమీ, ఉమేశ్ ఇద్దరూ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లని... వీరు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.