నీళ్లు నిలిచిన చోట రోడ్డు దాటిస్తూ.. సరికొత్త బిజినెస్!

Man earns money by transporting people across waterlogged roads
  • చిన్నపాటి తోపుడు బండిపై పాదచారులను దాటిస్తున్న వ్యక్తి
  • ఇందుకోసం పాదచారుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వైనం
  • రెడ్డిట్ లో పోస్ట్ అయిన వీడియో వైరల్
  • ‘ఇతనెవరోగానీ మంచి వ్యాపారవేత్తలా ఉన్నాడు’ అంటూ కామెంట్లు
వ్యాపారమంటే వ్యాపారమే.. ఏం చేశామన్నది కాదు. తప్పు చేయకుండా ఏ పని చేసి అయినా డబ్బులు సంపాదించడం ముఖ్యం. ఆర్థిక పరమైన అంశాలపై నిపుణులు ఎవరైనా చెప్పే మాట ఇదే. ఒక్కోసారి కష్టాల్లోనూ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించేవారు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జస్ట్ బండిలో రోడ్డు దాటిస్తూ.. 
  • ఇటీవల రెడ్డిట్ వెబ్ సైట్లో ఓ వీడియో పోస్ట్ అయింది. వర్షాలతో రోడ్డుపై నీరు పారుతున్న జంక్షన్ అది. అటు వైపుగా వెళ్తున్నవారు ఆ రోడ్డు దాటాల్సిన పరిస్థితి. రోడ్డుపై కార్లు దూసుకెళుతున్నాయి. నడుచుకుంటూ వెళితే.. కాళ్లు, బూట్లు, వస్త్రాలు తడిసిపోతాయి. బురద పడి పాడవుతాయి.
  • ఇక్కడే ఓ వ్యక్తి బిజినెస్ ఐడియా వేశాడు. చిన్నపాటి తోపుడు బండిని రోడ్డుకు ఓ వైపు పెట్టుకుని నిలబడ్డాడు. పాదచారుల దగ్గర డబ్బులు తీసుకుని ఆ తోపుడు బండిపై నిలబెట్టి.. రోడ్డుకు ఓ వైపు నుంచి మరోవైపు తీసుకెళ్లి వదిలేస్తున్నాడు.
  • రోడ్డుపై నీటిలో నడుచుకుంటూ వెళ్లలేక చాలా మంది అతడికి డబ్బులు ఇచ్చి తోపుడు బండిలో రోడ్డు దాటుతున్నారు.
  • రెడ్డిట్ వెబ్ సైట్లో బి ఆల్ఫోన్జో పేరిట ఉన్న అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ అయింది. ‘సమస్యలు ఉన్నప్పుడు సంపాదించే మార్గమిది’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో కాసేపటికే వైరల్ గా మారింది.
  • ‘ముందు అవసరం ఏమిటో గుర్తించాలి. ఆ అవసరం తీర్చే పని చేయాలి.. ఇది వ్యాపారంలో మొదటి నియమం. ఈ వ్యక్తి దీన్ని పక్కాగా ఆచరించి చూపిస్తున్నాడు’ అని యూజర్ కామెంట్ చేస్తే.. మరో యూజర్ ‘వ్యాపారంలో రెండో నియమం: సమస్యను సృష్టించాలి.. దానికి పరిష్కారాన్ని అమ్మాలి (ఈ ఘటనకు వర్తించదనుకోండి)’అని సరదాగా పేర్కొన్నారు.
  • ‘ఇతను ఎవరోగానీ మంచి వ్యాపార వేత్తలా ఉన్నాడు’ అని కొందరు.. ‘సరిగ్గా వెతుక్కుంటే డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు దొరుకుతాయి..’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Go Back to Shorts
Man earn money
Money
Business
Offbeat
Viral Videos

More Telugu News