భారీగా పెరిగిన కొత్తిమీర ధర.. వరంగల్ మార్కెట్లో కిలో రూ. 400
- నిన్నమొన్నటి వరకు రూ. 80-100 పలికిన వైనం
- కర్ణాటకలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట
- అరకొరగా వస్తుండడంతో ఎగబడుతున్న వ్యాపారులు
కర్ణాటకలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. దీంతో అక్కడి నుంచి ప్రస్తుతం అరకొరగా సరఫరా అవుతోంది. కొద్దిమొత్తంలో వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు పోటీపడుతుండడంతో దాని ధర అమాంతం కొండెక్కింది. నిన్న పలుమార్కెట్లలో కిలో రూ. 400 వరకు పలికింది. మహబూబాబాద్ జిల్లాలో రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, ధరల పెరుగుదలకు ఇదే కారణమని వ్యాపారులు చెబుతున్నారు.