కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం రేపు హైదరాబాద్‌కు రాజ్‌నాథ్ సింగ్
- కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న రాజ్‌నాథ్
- క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జరిగే సంస్మరణ సభకు హాజరు
- కేవలం 2.30 గంటలు మాత్రమే హైదరాబాద్‌లో ఉండనున్న కేంద్ర మంత్రి
శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాజ్‌నాథ్ సింగ్... మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటికి చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ నగర్లో జరగనున్న కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన హాజరు అవుతారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.20 గంటలకు రాజ్‌నాథ్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.